Monday, 19 February 2018

Jesus is creator but not the creation

యేసయ్య సృష్టికర్తే గాని, సృష్టించబడిన వాడు కాడు.

కొలస్సీయులకు 1:16:
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను.

అయితే ఈ రోజు అనేకమైన క్రీస్తు విరోధులు యేసయ్యను ఒక గొప్ప వ్యక్తిగా, ప్రవక్తగా, భోదకునిగా అంగీకరిస్తూనే యేసుప్రభువుని దేవునిచే స్ప్రుష్టించబడిన ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు .వీరిలో ముఖ్యులు ముస్లింలు, యెహోవా సాక్షులు, MORMONలు.ఈ అంశము ఈ రోజు లేవనెత్తిన అంశం కాదు.మొదటి శతాబ్దపు సనాతన క్రైస్తవ్యం యేసయ్య స్ప్రుష్టికర్తే గాని, స్ప్రుష్టించబడిన వాడు కాదని దేవుని ఊపిరిచే కలిగిన బైబిల్ ద్వారా నిరూపించగలిగారు.మొదటి శతాబ్దపు క్రైస్తవ మత సంక్షేపములో (Creeds of the Church) యేసయ్య స్ప్రుష్టించబడిన వాడు కాదని స్ప్రుష్టి కర్త అని గట్టిగా వాదించబడినది.

ముస్లింలు చెప్పేదేమనగా “యేసుప్రభువు వారు ఒక సామాన్య మానవ ప్రవక్త”.ఈయన అల్లాహ్ అనే దేవుని ద్వారా అద్భుతమైన రీతిలో జన్మించాడు.

MORMONలు, Arianism చెప్పేదేమనగా “తండ్రి అయిన దేవునికి ఏ విధముగా ఆది (Beginning) కలదో, యేసు ప్రభువు వారికి కూడా ఆది (Beginning) కలదు” అని.

ఇంకా యెహోవా సాక్షులు చెప్పేదేమనగా ” యేసయ్య యెహోవా దేవుని మొదటి స్ప్రుష్టి అని”, ఆయనకు మిఖాయేలు దూత అను పేరు కూడా కలదు అని చెబుతారు.

వీరి వాదనలన్నీ ఒక సారి ప్రక్కన పెట్టి యేసయ్య స్ప్రుష్టికర్త లేక స్ప్రుష్టించబడిన వాడా అని తెలుసుకోవటానికి మనకి ఒక్కడే ఆధారం ఆయనే మన మెస్సీయ “యేసు ప్రభువు” వారు.యేసయ్య తన పరిచర్యలో పదే పదే ఆయనకు దేవునికి మాత్రమే కలిగిన లక్షణాలు కలవని, స్ప్రుష్టించబడిన వాడు కాదని స్పృష్టి కర్త అని సాక్ష్యాలతో నిరూపించుకున్నాడు.

విశ్రాంతి దినమునకు ప్రభువు:
మార్కు 2:28:
అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.

విశ్రాంతి దినము దేవుడు నియమించిన ముఖ్యమైన పది ఆజ్ఞలలో ఒకటి.అయితే ఇక్కడ యేసయ్య మాత్రం తాను విశ్రాంతి దినమునకు ప్రభువును అని సెలవిస్తున్నాడు.ముస్లింలు ఎవరైతే యేసయ్య దేవుడు కాదు , దేవుని ప్రవక్త మాత్రమే అని చెప్పేవారు , వారి కురానులో గాని , దేవుని వూపిరి అయిన బైబిల్ లో గాని, ఏ ప్రవక్త అయిన “నేను విశ్రాంతి ధినమునకు ప్రభువు” అని ప్రకటించారని చూపగలరా.మీరే ఆలోచించుకోవాలి.

తండ్రితో సమానమైన మహిమను కలిగి ఉండుట:

యోహాను 17:5:
తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.

స్ప్రుష్టికర్త అయిన దేవునికే పరిమతమైన ఆరాధనను యేసయ్య స్వీకరించుట:

మత్తయి సువార్త 14: 33:
“అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి“.

భవిష్యత్తులో యేసయ్య తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై లోకమునకు తీర్పు తీరుస్తాడని హెచ్చరిస్తున్నాడు.

మత్తయి 25:31:
తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు;గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును.అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి;లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

ఇక్కడ యేసయ్య దేవుడు మాత్రమే కూర్చునే మహిమ గల సింహాసనం మీద కూర్చుని ఈ లోకానికి తీర్పు తీరుస్తాడని హెచ్చరిస్తున్నాడు.ఈ విధముగా దేవుని సింహాసనము మీద కూర్చుని తీర్పు తీర్చే ఒక సామాన్య ప్రవక్తని ముస్లిములు వారి ఖురానులో చూపగలరా!

యేసయ్య, వ్యక్తిగతంగా కేవలం దేవుడు మాత్రమే క్షమించగలిగిన, ఒక పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపాలన్నిటిని తీసివేసాడు.

లూకా 7:48:
నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను.అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండినవారుపాపములు క్షమించుచున్న యితడెవడని తమలోతాము అనుకొనసాగిరి.అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.

ఆయన ఎవరో ఒక ప్రవక్త లేక దేవుడా అనే అనుమానం ఆరోజు భోజన పంక్తిని కూర్చుండినవారికి వచ్చినట్లుగా ఈ రోజు మన ముస్లిం సహోదరులకు రావడం లేదు.

యేసయ్య తో పాటు 3 సంత్సరాలు పరిచర్య చేసిన శిష్యులు ఆయన స్పృష్టి కర్త అని తెలుసుకున్నారు , ఆయనను ఆరాధించారు:

యేసయ్య ప్రియ శిష్యుడైన యోహాను “ఆయన ఆది యందు వున్నవాడు అన్నాడు” (యోహాను 1: 1).

మరొక శిష్యుడైన తోమ “నా దేవా , నా ప్రభువా” (యోహాను 20:28) అని యేసయ్య వద్ద మోకరిల్లాడు .
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం యేదనగా , బైబిల్ లో అనేకమైన చోట్ల మనుష్యులు దేవదూతలకు, ప్రవక్తలకు మ్రొక్కినపుడు వారు వారించి మాకు మ్రొక్క కూడదు సర్వస్పృష్టి కర్త అయిన దేవునికే ఆ ఘనత చెందాలి అని వారిని నివారించారు .యేసయ్య మాత్రం అధ్భుతముగా తనని దేవుడు అన్న తోమా ను ఏమాత్రం వారించలేదు, ఇంకా “నీవు నన్ను చూచి (దేవుడని) నమ్మితివి చూడక నమ్మని వారు ధన్యులు” (యోహాను 20:29) అని యేసయ్య సమాధానం ఇచ్చారు.ఇప్పుడు మనం ఆయనను ప్రత్యక్షముగా చూడకయే ఆయనను దేవుడని నమ్ముతున్నాం కనుక మనం ధన్యులం.

అపోస్తులుడైన పౌలు మన యేసయ్యను సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు మరియు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు నందు నివసిస్తుంది అని భోదిస్తున్నాడు.

దేవుని స్వంత కుమారుడైన యేసయ్య:
రోమీయులకు 8: 4:
” దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను”

ఫిలిప్పీయులకు 2: 6 – 7
” ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను”

ఆయన మన కొరకు దేవుడై వుండి కూడా, తన్నుతాను తగ్గించుకుని నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని, పాపపరిహారార్ధ బలిగా శిలువపై అర్పించాడు.అంతే గాని ఆయన స్పృష్టించబడిన వాడు కాదు.మనమందరం ఈ విషయాన్ని ఇప్పటికైనా అర్ధం చేసుకుందాం.

         -Telugu Christian Apologetics Church
Source-Jim Joseph (Facebook)

Life is for learning

*జీవితం అంటే  యేడుస్తూ కూర్చోడం కాదు.,  జీవితం  అంటే  - నాకు  ఇంతే రాసి పెట్టి వుంది - అనుకుని  - నా ఖర్మ  ఇంతే - అంటూ నిందించడం కాదు .,  జీవితం  అంటే  -  నేర్చుకోవడం*
సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు.

ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.

 సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.

 పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.

సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.

 జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు.

సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.

 సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు.

సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది.

శిష్యులు

 ”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు.

కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు.

 నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.

 గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను.

ఇంకా నాజీవితంలో గంట సమయముంది.
.
అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.

 శిష్యుల నోట్లో మాట రాలేదు..

I కొరింథీయులకు 14 : 31 - *అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును.*
Source-Rakada Karuna Kumar (Facebook)

Is there end to Christianity?

క్రైస్తవులు,నక్షత్రం చేప

నక్షత్రం చేప భుజాల్లో ఒకటి తెగిపోతే ఆ స్థానంలో మరో భుజం పుట్టుకొస్తుందని మీకు తెలుసా?నిజానికి నక్షత్రం చేపను రెండు ముక్కలుగా కోసినా దాని కేంద్రీయ నాడి ఉన్న ముక్క మళ్ళీ మరో చేపగా పెరుగుతుంది.

           ముత్యపు చిప్పలు వేటాడే కొందరు జాలరులు ఈ విషయం కనిపెట్టారు.ముత్యపు చిప్పలు దొరికే ప్రాంతమంతా నక్షత్రం చేపలతో నిండిపోవడం వారిని అసహనానికి గురి చేసింది.ఈ జాలరులు వాటిని ముక్కలుగా కోసి తిరిగి నీటిలో పడవేశారు.అయితే అవి నాశనం కాలేదు సరికదా ఇంకా ఎక్కువగా వృద్ధి చెందాయి.

   శతాబ్దాలుగా అనేక దేశాల్లో క్రైస్తవులను ద్వేషించి వ్యతిరేకించి,హింసించారు.అయితే హింస క్రైస్తవులను నాశనం చేయలేకపోయింది.ఈ విపరీత పరిస్థితుల్లో క్రైస్తవ్యం కేవలం నిలిచి ఉండడం కాదు గానీ,ఎంతో అభివృద్ధి చెందింది.యేసు తన సంఘానికి ఇలా చెప్పారు "పాతాళ లోక ద్వారాములు దాని ఎదుట నిలువనేరవు" (మత్తయి 16:18)

   యేరుషలేములో మొదటి శతాబ్దపు క్రైస్తవులను తీవ్రంగా హింసించారు.కాని దీని ద్వారా వారు యూదయ,సమరయ దేశాల్లోకి చెదరిపోయారు.వారు వెళ్లిన ప్రతీ స్థలం'లోనూ సువార్త ప్రకటించారు.అనేకమంది యేసునందు విశ్వసించారు.ఆపో.కా.8:4-6 ఫిలిప్పు బోధింఛినప్పుడు అనేకమంది మారుమనస్సు పొందడం చూస్తాం.

అవును,ప్రభువైన యేసుక్రీస్తు సంఘం ఎంత తీవ్రమైన హింస పొందినప్పటికీ అది అభివృద్ధి చెందుతూనే ఉంది. పాతాళ లోక సైన్యములు దాని ముందు నిలువనేరవు.

    🔪హతసాక్షులు చిందించిన రక్తం సంఘానికి విత్తనం🌾

Source: Bro.Jim Joseph K (Facebook)
Messiah Gospel Service
https://www.youtube.com/channel/UCM8Azd_X1XThdQnM-PjajRw

Choice is yours for good or bad?

ఆదికాండము 3 : 22 - అప్పుడు దేవుడైన యెహోవా *ఇదిగో మంచి చెడ్డ లను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను.*

అంటే దేవునికి మంచి,చెడుల విచక్షణ ఎలా తెలుసో,అలాగే మనిషికి కూడా తెలుసన్న మాట.

ప్రతి వస్తువుని మంచికీ వాడొచ్చు చెడుకీ వాడొచ్చు..
మరి మనం ఎలా వాడుతున్నామో చూద్దామా. !!

ప్రస్తుత సమాజంలో చదువురాని వాడన్నా ఉన్నాడేమో గానీ *సెల్ ఫోన్* లేనివాడు మాత్రం లేడు.మరి ఆ వస్తువుని మంచికి వాడుతున్నారా?చెడుకి వాడుతున్నారా?
1.ఫోన్ లో మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి?
2.మనం వినే మాటలు ఎలా ఉంటున్నాయి?
3.మన ఫోన్ రింగ్ టోన్ ఎలా ఉంది?
4.మన ఫోన్ వాల్ పేపర్ ఎలా ఉంది?

మీరు అంతర్జాలం(Internet) సౌకర్యం ఉన్న ఫోన్ వాడుతున్నట్లు అయితే..
1.మీ వాట్స్ ఆప్ లో ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు?
2.మీ ఫేస్ బుక్ లో అసలు మీ ఫేస్ కనపడుతుందా?లేక లోక సంబంధ మైనవి కనపడతాయా?
3.గూగుల్ లో ఎక్కువగా వేటిని వెతుకుతున్నారు?
4.మీ ఫోన్ లో బైబిల్ ఆప్ ఉందా?
5.యూ ట్యూబ్ లో ఎక్కువగా చూసే వీడియోలు ఏమిటి?
6.మీ ఫోన్ లో గేమ్స్ ఉన్నాయా?వాటి ద్వారా మీరు ఏమి పొందుకుంటున్నారు?

ఆఖరి రెండు ప్రశ్నలు:-
1.మీ ఫోన్ ని ధైర్యంగా ఇతరులకి ఇవ్వగలరా?వారు మీ గాలరీ లోకి వెళ్లినా కూడా తడబడకుండా,ఫోన్ లాక్కోకుండా ఉండగలరా?
2.మీ ఫోన్ మీకు బానిసగా ఉంటుందా?లేక మీరే మీ ఫోన్ కి బానిసగా మారిపోయారా?

ఒక్క వస్తువు గురించి మంచి,చెడులు ప్రస్తావిస్తేనే ఇంత మెస్సెజ్ రాయవలసి వచ్చింది. ఇంకా చాలా వస్తువులున్నాయ్.మరి వాటిని మంచికి వాడుతున్నామా?లేక చెడుకి , చెడిపోవడానికి వాడుతున్నామా ?అనే ప్రశ్న మిమ్మల్ని మీరే వేసుకోండి.

*మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.*
(I కొరింథీయులకు 10 : 31)
      Source -Rakad Karuna Kumar (Facebook)