ఒకావిడకి కల వచ్చిందట. ఆ కలలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ చెంతకి వచ్చాడు. మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి కరుణతో కృపతో వదనంలో వెల్లివిరిసిన చిరునవ్వు ప్రేమను కురిపిస్తూ ఉండగా ఆమెతో మృదువుగా మధురంగా మాట్లాడాడు.
ఆమెని వదలి రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె నుదుటి మీద ఒక్క క్షణం చెయ్యి వేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూసాడు.
మూడో ఆమెవైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు. ఆ కలలో ఆ కలకంటున్న ఆమె అనుకుందట - దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడు. రెండో ఆవిడని కూడా మెచ్చుకున్నాడు. కాని మొదటి ఆమె పట్ల చూపించిన ప్రేమను చూపించలేదు. మూడవ స్త్రీ మాత్రం ఆయన్ని ఎంతో బాధపెట్టి ఉంటుంది. అందుకే ఆమెతో మాట్లాడలేదు సరికదా కనీసం ఆమె వంక చూడనైనా చూడలేదు.
దేవుడలా ఎందుకు చేసాడో ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు. మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ నా అపేక్ష ఆమెకి అవసరం. దినంలో ప్రతిక్షణం నేను నా ప్రేమతో ఆమెని వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి. లేకపోతే ఆమె దారి తప్పిపోయి పడిపోతుంది.
రెండో ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది. ఆమె ప్రేమ లోతైనది. పరిస్థితులు ఎలాటివైనా మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసముంచుతుందన్న నమ్మకం నాకుంది.
నేను నిర్లక్ష్యం చేసినట్టు పట్టించుకోనట్టు ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం ప్రేమ అతి శ్రేష్ఠమైనవి. నేనే ఆమెకు అత్యున్నతమైన బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణనిస్తున్నాను.
ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు తెలుసుకుని ఆయన్ని స్తుతిస్తూ ఉంటే నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు.
-taken from book named "ఎడారిలో సెలయేర్లు"